Tirupati: తిరుపతి రూరల్‌లో ‘ఆపరేషన్ త్రిశూల్’ ప్రారంభించిన ఎస్సై లోకేష్!
Tirupati: తిరుపతి రూరల్ మండలం కాలూరు అరుంధతివాడలో ఎస్సై లోకేష్ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ త్రిశూల్’ సదస్సు. గంజాయి నిర్మూలన, మహిళల భద్రతపై గ్రామస్తులకు అవగాహన.
Tirupati: తిరుపతి రూరల్‌లో ‘ఆపరేషన్ త్రిశూల్’ ప్రారంభించిన ఎస్సై లోకేష్!
తిరుపతి: తిరుపతి రూరల్ మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళలు-చిన్నారుల భద్రత మరియు రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఈ ప్రత్యేక ‘ఆపరేషన్ త్రిశూల్’ను ప్రారంభించిందని తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై లోకేష్ పేర్కొన్నారు.
తిరుపతి రూరల్ మండలం సి మల్లవరం గ్రామపంచాయతీ కాలూరు అరుంధతి వాడ గ్రామంలో త్రిశూల్ ఆపరేషన్ కార్యక్రమంపై గ్రామ మహిళలకు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ లొకేషన్ గ్రామస్తులు స్థానిక టిడిపి ఇన్చార్జ్ మనోహర్ చౌదరి దుశ్యాలువతో ఘనంగా సన్మానించారు.
ఎస్సై లోకేష్ మాట్లాడుతూ, మారకద్రవ్యాలు గంజాయి మత్తు వలన ప్రజలకు వచ్చే నష్టాలు పూర్తిస్థాయిలో వివరించారు. పిల్లలు గంజాయి మత్తులో వివిధ వ్యసనాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పారు.
అలాగే రోడ్డు ప్రమాదాల నివారించే క్రమంలో భాగంగా చిన్నారులకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు తెలియజేశారు. మహిళల భద్రితే ధ్యేయంగా పోలీసులు పని చేస్తున్నామని ఏ సమస్య వచ్చినా తమను ఆశ్రయించాలని ఆయన మహిళలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు, సంఘమిత్ర మునెమ్మ తదితరులు పాల్గొన్నారు.




