Tiruchanur: మీ ఆదరాభిమానాలే నా విజయం: తిరుచానూరు సర్పంచ్ మునెమ్మ!

Tiruchanur: తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన వడ్రాయన మునెమ్మ ఎమ్మెల్యే పులివర్తి నాని, టీడీపీ నేతలకు, గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 26 Nov 2026 11:42 AM IST
Tiruchanur
X

Tiruchanur: మీ ఆదరాభిమానాలే నా విజయం: తిరుచానూరు సర్పంచ్ మునెమ్మ!

తిరుచానూరు: ఒక పదవి దక్కడం కంటే.. ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవడం గొప్ప గౌరవం. తిరుచానూరు పంచాయతీ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం నా జీవితంలో మరపురాని ఘట్టం. ఈ అరుదైన గౌరవాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ సదా రుణపడి ఉంటాను. నా విజయానికి మార్గదర్శకత్వం వహించి, వెన్నుదన్నుగా నిలిచిన చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు.

ప్రజల ఆశీస్సులు, పెద్దల ప్రోత్సాహం, నాయకులు, కార్యకర్తల సహకారం నాకు కొండంత బలాన్ని ఇచ్చాయి. ఈ విజయం ఒక వ్యక్తికి దక్కిన గౌరవం కాదు.. గ్రామ ప్రజల ఐకమత్యానికి లభించిన గుర్తింపు. మీరు నాపై ఉంచిన విశ్వాసాన్ని అభివృద్ధి రూపంలో తిరిగి అందించడమే నా సంకల్పం. గ్రామ ప్రగతికి, ప్రజల ఆకాంక్షల సాధనకు నిరంతరం శ్రమిస్తానని మాట ఇస్తున్నాను. మీ నమ్మకమే నా నడకకు బలం.. తిరుచానూరు అభ్యున్నతే నా అంతిమ లక్ష్యం.. కృతజ్ఞతలతో.. మీ... వడ్రాయన మునెమ్మ, సర్పంచ్, తిరుచానూరు, తిరుపతి రూరల్ (మండలం) తిరుపతి జిల్లా.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL