Sullurupeta: తిరుపతిలో 470 మంది షీటర్లకు ఎస్పీ సుబ్బారాయుడు మెగా కౌన్సెలింగ్!
Sullurupeta: తిరుపతిలో ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆధ్వర్యంలో 470 మంది రౌడీ షీటర్లు, గంజాయి ముద్దాయిలకు మెగా కౌన్సెలింగ్.
Sullurupeta: తిరుపతిలో 470 మంది షీటర్లకు ఎస్పీ సుబ్బారాయుడు మెగా కౌన్సెలింగ్!
సూళ్ళూరుపేట: సమాజంలో మార్పు తీసుకురావడమే ధ్యేయంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు (ఐపీఎస్) ఆధ్వర్యంలో శనివారం తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా స్థాయి "మెగా కౌన్సెలింగ్" కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లు, గంజాయి ముద్దాయిలు, పోక్సో మరియు దొంగతనం కేసులలో రికార్డు ఉన్న సుమారు 470 మంది షీటర్లకు ఎస్పీ గారు స్వయంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట సబ్ డివిజన్ నుండి మొత్తం 70 మంది హాజరుకాగా, అందులో సూళ్ళూరుపేట సర్కిల్ పరిధి ప్రత్యేకంగా నిలిచింది. సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకుని, తమ సర్కిల్ పరిధిలోని 30 మంది రౌడీ షీటర్లు, గంజాయి ముద్దాయిలు, పోక్సో మరియు దొంగతనం కేసుల షీటర్లను తిరుపతికి తరలించేందుకు ప్రత్యేకంగా ఒక బస్సును ఏర్పాటు చేశారు. సీఐ ఎం. మురళీకృష్ణ పర్యవేక్షణలో సూళ్ళూరుపేట ఎస్సైలు గంటా అజయ్ కుమార్,సుబ్రహ్మణ్యంరాజు,తడ ఎస్సై కొండప్పనాయుడు మరియు పోలీస్ సిబ్బంది స్వయంగా ఆ బస్సులో ఈ 30 మందిని సురక్షితంగా తిరుపతి పోలీస్ గ్రౌండ్స్‌కు తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు మాట్లాడుతూ.. జిల్లాలో రౌడీయిజం, గంజాయి రవాణా, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. అనంతరం పోలీసులు యువతకు హితవు పలుకుతూ.. క్షణికావేశంలో తప్పుడు మార్గాల్లోకి వెళ్లి మీ బంగారు భవిష్యత్తును జైలు పాలు చేసుకోవద్దు. మీ వెనుక మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలు ఉన్నాయి. మన సూళ్ళూరుపేట, తడ పరిసర ప్రాంతాలలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు ఉన్నాయి. చెడు సావాసాలు వీడి ఆయా పరిశ్రమల్లో గౌరవప్రదమైన ఉద్యోగాలు లేదా ఉపాధి అవకాశాలు పొంది, కుటుంబాలకు ఆసరాగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూళ్ళూరుపేట, తడ పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.




