Tirupati: ఓటీపీలు, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి పోలీసుల హెచ్చరిక!

Tirupati: ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో సైబర్ నేరాలు, మహిళల భద్రత, శక్తి యాప్ వినియోగంపై పోలీసులు విస్తృత అవగాహన కల్పించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 18 July 2026 10:47 PM IST
Tirupati
X

Tirupati: ఓటీపీలు, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి పోలీసుల హెచ్చరిక!

తిరుపతి: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో ప్రజా భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

గ్రామాలు, విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాల్లో బాల్య వివాహాల నిర్మూలన, మైనర్ల డ్రైవింగ్, సైబర్ నేరాలు, ఫేక్ OTP మోసాలు, మహిళల భద్రత, శక్తి యాప్, డయల్-112 సేవల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే గంజాయి, ర్యాగింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్, జూదం వంటి సామాజిక దుష్ప్రవర్తనలకు దూరంగా ఉండాలని సూచించారు.

రేణిగుంటలో ఫుట్ ప్యాట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి ప్రజలు, వ్యాపారులతో పోలీసులు మమేకమయ్యారు. బ్యాగ్ లిఫ్టింగ్, చైన్ స్నాచింగ్ వంటి ఆస్తి నేరాల నివారణతో పాటు ట్రాఫిక్ నిబంధనలు, ఓవర్ స్పీడ్, తప్పు పార్కింగ్, VIP రూట్లలో పాటించాల్సిన నియమాలపై కూడా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, అపరిచితుల ఫోన్ కాల్స్, లింకులు, OTPలు, బ్యాంకు వివరాలను ఎవరికీ ఇవ్వవద్దని, అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 మరియు శక్తి యాప్ సేవలను వినియోగించాలని ప్రజలకు సూచించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story