Tirupati: తిరుపతి, నాయుడుపేట కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ సుబ్బరాయుడు!
Tirupati: తిరుపతి ఆర్ట్స్ కాలేజ్, నాయుడుపేట కౌంటింగ్ కేంద్రాలలో స్వయంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు. స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత, పోలీస్ బందోబస్తు పరిశీలన.
Tirupati: తిరుపతి, నాయుడుపేట కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ సుబ్బరాయుడు!
Tirupati: తిరుపతి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ తిరుపతి ఆర్ట్స్ కాలేజ్‌తో పాటు పుత్తూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వేంకటగిరి కౌంటింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, తిరుపతి ఆర్ట్స్ కాలేజ్, నాయుడుపేట కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి, జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతున్న తీరును, కేంద్రాల పరిసర ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను, పోలీస్ బందోబస్తును, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తతను, భద్రతా విధుల నిర్వహణ తీరును సమీక్షించారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరంతర నిఘా కొనసాగించాలని, విధుల్లో ఉన్న ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని పోలీస్ అధికారులకు స్పష్టం చేశారు.
జిల్లాలోని అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు భద్రతా విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.




