Tirupati: తిరుపతి జిల్లా ప్రజలకు ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు దీపావళి శుభాకాంక్షలు!
Tirupati: తిరుపతి జిల్లా ప్రజలకు ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు దీపావళి శుభాకాంక్షలు. పండుగ వేళ బాణసంచా భద్రతా సూచనలు మరియు హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల.
Tirupati: తిరుపతి జిల్లా ప్రజలకు ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు దీపావళి శుభాకాంక్షలు!
Tirupati: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రేమ, ఆప్యాయత, సోదరభావం, సామరస్యాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని కోరారు.
పండుగ వేళ బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, పిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు వినియోగించాలని జిల్లా ఎస్పీ సూచించారు. వృద్ధులు, చిన్నపిల్లల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా బాధ్యతాయుతంగా పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దీపావళి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి వేళల్లో నిరంతర నిఘా కొనసాగిస్తామని ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో ఏవైనా అవాంఛనీయ ఘటనలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినట్లయితే వెంటనే డయల్ 112 లేదా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ 8099999977 కు సమాచారం అందించాలని కోరారు.
ప్రజలందరూ పోలీస్ శాఖ సూచించిన భద్రతా నియమాలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో సురక్షితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు.




