Renigunta: తారకరామానగర్‌లో ఆపరేషన్ త్రిశూల్: ఎస్పీ సుబ్బారాయుడు
Renigunta: రేణిగుంట మండలం తారకరామానగర్‌లో ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆపరేషన్ త్రిశూల్ నిర్వహించి మహిళా భద్రత, గంజాయి నిర్మూలనపై అవగాహన కల్పించారు.
Renigunta: తారకరామానగర్‌లో ఆపరేషన్ త్రిశూల్: ఎస్పీ సుబ్బారాయుడు
రేణిగుంట: మండలంలోని తారకరామానగర్‌లో ‘ఆపరేషన్ త్రిశూల్’ కార్యక్రమంలో భాగంగా మహిళా భద్రత, గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతపై తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ప్రజలకు అవగాహన కల్పించారు.
మహిళలు, యువత, గ్రామ ప్రజలకు మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, పోలీసుల సహాయ సేవలపై ఎస్పీ వివరించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ.. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని చెప్పారు.
అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడిపే సమయంలో సెల్‌ఫోన్ వినియోగించరాదని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఎస్పీ సూచించారు.
మహిళలు, యువత, ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు,సీఐ జయచంద్ర, ఎస్సై శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




