Tirupati: శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. వైభవంగా ధ్వజారోహణం!
Tirupati: తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం మిథున లగ్నంలో ధ్వజారోహణ మహోత్సవంతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
Tirupati: శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. వైభవంగా ధ్వజారోహణం!
Tirupati: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం మిథున లగ్నంలో ధ్వజారోహణ మహోత్సవంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదఘోషలు, మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణల నడుమ గరుడ చిత్రంతో అలంకరించిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.
అంతకుముందు శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారు వెండి తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. అనంతరం విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, రక్షాబంధనం తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం స్నపన తిరుమంజనం వైభవంగా జరగగా, సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రి పెద్దశేష వాహనసేవ నిర్వహించనున్నారు. పెద్దశేష వాహనంపై స్వామివారు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలతో ఆలయ పరిసరాలను ఆధ్యాత్మిక శోభతో తీర్చిదిద్దింది. ప్రతిరోజూ భక్తి సంగీత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.




