Srikalahasti: శ్రీకాళహస్తి అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించండి: కోలా ఆనంద్!
Srikalahasti: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 14వ వార్డు బీజేపీ అభ్యర్థి కావ్యను గెలిపించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ప్రచారం నిర్వహించారు.
Srikalahasti: శ్రీకాళహస్తి అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించండి: కోలా ఆనంద్!
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో జరుగుతున్న రెండో దశ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా పట్టణంలోని 14వ వార్డులో బిజెపి అభ్యర్థి కావ్యను గెలిపించాలని కోరుతూ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పార్టీ అన్ని వార్డులలో పోటీ చేస్తుందని. 44 వార్డులలో కూటమి అభ్యర్థులు గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలలో కూటమి అభ్యర్థులు విజయ కేతనం ఎగురు వేశారని.
అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ మరియు పెండింగ్ మున్సిపల్ ఎన్నికలలో కూడా కూటమి అభ్యర్థులు గెలుపొందుతారని అన్నారు. గత రెండున్నర సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , నారా లోకేష్, బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని ఆయన తెలిపారు. శ్రీకాళహస్తి అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోవడానికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి, బిజెపి జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




