Srikalahasti: శ్రీకాళహస్తిలో వైసీపీ గెలుపే లక్ష్యంగా బియ్యపు విస్తృత ప్రచారం!

Srikalahasti: శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం విస్తృతంగా ప్రచారం చేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 21 Nov 2026 1:15 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో వైసీపీ గెలుపే లక్ష్యంగా బియ్యపు విస్తృత ప్రచారం!

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శనివారం శ్రీకాళహస్తి పట్టణంలోని 41, 42వ వార్డుల్లో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదని విమర్శించారు. స్థానిక ఎన్నికల ప్రక్రియను అధికార పార్టీ ప్రహసనంగా మార్చిందని, దాడులు, దౌర్జన్యాలు, నామినేషన్ పత్రాల చించివేతలతో ఎన్నికలు సాగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటూ టీడీపీ నాయకుల అక్రమాలకు సహకరించిన ఉద్యోగులను ఎవరినీ వదిలిపెట్టబోమని, రాబోయే రోజుల్లో చట్టం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు.

శ్రీకాళహస్తిలో ప్రస్తుతం అభివృద్ధి కంటికి కనిపించడం లేదని, పట్టణ ప్రజలకు వాస్తవాలు తెలుసని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కొండచుట్టూ రోడ్డు నుంచి శ్మశానవాటిక వరకు, శివం టు శివం రోడ్డు నుంచి నాలుగు మాడ వీధుల్లో భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ తదితర అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు.

శ్రీకాళహస్తి పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లు తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కోరారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI