Srikalahasti: కూటమి మున్సిపల్ ఎన్నికల ప్రచార జోరు.. రెండో వార్డులో సునీత విస్తృత ప్రచారం!

Srikalahasti: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో వార్డు టీడీపీ కూటమి అభ్యర్థి సునీత ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 23 Nov 2026 1:32 PM IST
Srikalahasti
X

Srikalahasti: కూటమి మున్సిపల్ ఎన్నికల ప్రచార జోరు.. రెండో వార్డులో సునీత విస్తృత ప్రచారం!

శ్రీకాళహస్తి: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శ్రీకాళహస్తిలో కూటమి అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. రెండో వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీత కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి వార్డు పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ, వార్డు అభివృద్ధి లక్ష్యంగా కూటమికి మద్దతు ఇచ్చి ఓటు వేయాలని అభ్యర్థించారు. వార్డు సభ్యురాలిగా తనకు ఒక ఓటు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పేట బాలాజీకి మరో ఓటు వేసి కూటమిని గెలిపించాలని ప్రజలను కోరారు.

మున్సిపాలిటీ అభివృద్ధికి కూటమి పాలన అవసరమని, వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సునీత ప్రజలకు హామీ ఇస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. కూటమి నాయకులు, కార్యకర్తల నినాదాలతో రెండో వార్డులో ఎన్నికల సందడి నెలకొంది.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI