Tirupati: స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు
Tirupati: తిరుపతి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం 2,202 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు.
Tirupati: స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు
తిరుపతి: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా జిల్లా పోలీస్ శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టిందని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు తెలిపారు. తిరుపతి, పుత్తూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి మున్సిపాలిటీల పరిధిలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అదనపు ఎస్పీ, 8 మంది డీఎస్పీలు, 26 మంది సీఐలు, 98 మంది ఎస్‌ఐలతో పాటు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 2,202 మంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు.
అదనపు బలగాలను మోహరించడంతో పాటు రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను సిద్ధంగా ఉంచారు. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే డయల్ 112 కు సమాచారం అందించాలని సూచించారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని, ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు.




