Tirupati: రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు విద్యార్థి ఎంపిక
Tirupati: తిరుపతిలో జరిగిన జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి అండర్-17 విభాగంలో విజేతగా నిలిచి, రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థి.
Tirupati: రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు విద్యార్థి ఎంపిక
తిరుపతి: తిరుపతిలో బుధవారం ముగిసిన జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ బాక్సింగ్ ఎంపిక పోటీలలో ఈ విద్యార్థి అద్భుత ప్రతిభ కనబరిచి అండర్-17 విభాగంలో, 80 కేజీల కేటగిరీలో విజేతగా నిలిచాడు.
ఈ విజయంతో అక్టోబర్ 9 నుండి 11వ తేదీ వరకు ఒంగోలులో జరగనున్న స్కూల్ గేమ్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో తిరుపతి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.
గ్రామీణ ప్రాంత పాఠశాల నుండి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించి, ఒంగోలులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ పతకం సాధించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.




