Tirupati: ఎన్డీఏ పరీక్షల్లో తిరుపతి వెరిటాస్ సైనిక్ స్కూల్ ఘన విజయం

Tirupati: దక్షిణ భారతదేశంలోనే మొదటి ప్రైవేట్ సైనిక పాఠశాల తిరుపతి వెరిటాస్ సైనిక్ స్కూల్‌కు చెందిన 11 మంది క్యాడెట్లు UPSC NDA పరీక్షలో అర్హత సాధించారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 11 Oct 2026 7:51 PM IST
Tirupati
X

Tirupati: ఎన్డీఏ పరీక్షల్లో తిరుపతి వెరిటాస్ సైనిక్ స్కూల్ ఘన విజయం

తిరుపతి: దక్షిణ భారతదేశంలోనే మొదటి ప్రైవేట్ సైనిక పాఠశాలగా పేరొందిన తిరుపతి వెరిటాస్ సైనిక స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఘనవిజయం సాధించారు. UPSC నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలో పాఠశాలకు చెందిన 11 మంది క్యాడెట్లు అర్హత సాధించి సత్తా చాటారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఘనంగా విజయోత్సవ సభను నిర్వహించారు. తిరుపతి సి.రామాపురంలోని వెరిటాస్ సైనిక స్కూల్ 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి UPSC నిర్వహించిన NDA పరీక్షలో అద్భుత ప్రతిభ కనబరిచింది.

సెప్టెంబర్ నెలలో జరిగిన ఈ పరీక్షకు స్కూల్ నుంచి 78 మంది క్యాడెట్లు హాజరుకాగా, వారిలో 11 మంది పన్నెండో తరగతి విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో అర్హత సాధించారు.

ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధ వీరుడు, పాఠశాల వ్యవస్థాపకులు, ఛైర్మన్ డాక్టర్ బి. శేషారెడ్డి విజయవంతమైన విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందించారు. భారత్ త్రివిధ దళాలలో అధికారులుగా చేరేందుకు యువతను తీర్చిదిద్దడమే తమ సంస్థ ముఖ్య లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL