Tirupati: తిరుపతి ఓటరు ఎన్యూమరేషన్‌కు 10 రోజులు గడువు పెంపు
Tirupati: తిరుపతి జిల్లాలో ఓటరు ఎన్యూమరేషన్‌కు 10 రోజుల గడువు పెంచిన ఎన్నికల సంఘం. జూలై 31న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల చేస్తామని కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ వెల్లడి.
Tirupati: తిరుపతి ఓటరు ఎన్యూమరేషన్‌కు 10 రోజులు గడువు పెంపు
తిరుపతి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా జరుగుతున్న డోర్ టు డోర్ ఎన్యూమరేషన్ కార్యక్రమానికి భారత ఎన్నికల సంఘం మరో 10 రోజుల గడువు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.
మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఇంటింటి ఎన్యూమరేషన్ దాదాపు పూర్తైందని, మిగిలిన స్వల్ప వివరాలను కూడా ఈ అదనపు గడువులో పూర్తి చేస్తామని చెప్పారు.
జూలై 31న డ్రాఫ్ట్ ఓటరు జాబితాతో పాటు ASD (Absent, Shifted, Dead) జాబితాను కూడా ప్రజల పరిశీలన కోసం ప్రచురిస్తామని తెలిపారు. ASD జాబితాపై ఎవరైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఆధారాలతో దాఖలు చేయవచ్చని, ఎన్నికల నమోదు అధికారి (ERO) పూర్తిస్థాయి విచారణ అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.
జిల్లాలో సుమారు 2.02 లక్షల మంది ఓటర్ల వివరాలు ఇంకా మ్యాపింగ్ కాలేదని, వారికి నోటీసులు జారీ చేసి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఎన్నికల సంఘం కల్పించిన అదనపు గడువును ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ ఓటరు వివరాలను ధ్రువీకరించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.




