Tirupati: కూటమిపై ఒత్తిడి తెచ్చి సమస్యలు తీరుస్తున్న జగన్ మాజీ మంత్రి రోజా!
Tirupati: తిరుపతి వైఎస్సార్‌సీపీ సమావేశంలో మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపై కూటమి ప్రభుత్వంపై విమర్శలు, డీఎస్సీపై సీబీఐ విచారణకు డిమాండ్.
Tirupati: కూటమిపై ఒత్తిడి తెచ్చి సమస్యలు తీరుస్తున్న జగన్ మాజీ మంత్రి రోజా!
Tirupati: ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూటమిపై ఒత్తిడి తెచ్చి..ప్రజా సమస్యల పరిష్కారానికి జగన్ కృషి చేస్తున్నారని మాజీ మంత్రి రోజా అన్నారు. తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా YCP సమన్వయకర్తల సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించారు.
ఈ నేపథ్యంలో ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లేందుకు YCP శ్రేణులు సిద్ధంగా ఉండాలని రోజా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారంటూ కూటమిపై విమర్శలు గుప్పించారు. డీఎస్సీ పోస్టులు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
DSCపై సీబీఐ విచారణ జరిపించి అనర్హులను ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేయాలని సూచించారు.




