Tirupati: ముండ్లపూడిలో వైసీపీ విస్తృత ప్రచారం.. అలేఖ్యకు మద్దతు

Tirupati: తిరుపతి రూరల్ మండలం ముండ్లపూడి సర్పంచ్ వైసీపీ అభ్యర్థి పి. అలేఖ్య తరఫున ఇంటింటి ప్రచారం; కత్తెర గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించిన నేతలు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 27 Nov 2026 6:19 PM IST
Tirupati
X

Tirupati: ముండ్లపూడిలో వైసీపీ విస్తృత ప్రచారం.. అలేఖ్యకు మద్దతు

తిరుపతి: తిరుపతి రూరల్ మండలం ముండ్లపూడి గ్రామ పంచాయతీ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేస్తున్న పి.అలేఖ్యను అఖండ మెజారిటీతో గెలిపించాలని వైసిపి శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.

శుక్రవారం గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ముండ్లపూడి మాజీ సర్పంచ్ లు సురేష్ రెడ్డి (సూరి), వెంకట రమణ, వార్డు మెంబెర్ అభ్యర్థులు, వైయస్సార్సీపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని కరపత్రాలు పంపిణీ చేశారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL