Srikalahasti: శ్రీకాళహస్తిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కాలిపోయిన బంగారం, నగదు!
Srikalahasti: శ్రీకాళహస్తిలోని వాటర్ హౌస్ కాలనీలో అగ్నిప్రమాదం. కుమార్తె వివాహం కోసం దాచుకున్న బంగారం, నగదు కాలిపోయి రోడ్డున పడ్డ సెల్వి అనే మహిళ.
Srikalahasti: శ్రీకాళహస్తిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కాలిపోయిన బంగారం, నగదు!
Srikalahasti: శ్రీకాళహస్తి పట్టణంలోని వాటర్ హౌస్ కాలనీలో నివాసముంటున్న సెల్వి అనే మహిళ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్న సెల్వి, తన కుమార్తె వివాహం కోసం ఎంతో కష్టపడి దాచిపెట్టిన లక్ష రూపాయల నగదు, సుమారు అర కిలో వెండి, ఐదు సవర్ల బంగారం మంటల్లో కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది.
అగ్నిప్రమాదం సమయంలో ఇంట్లో ఉన్న ఫర్నిచర్, గృహోపకరణాలు, ఇతర విలువైన వస్తువులు కూడా పూర్తిగా దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన సెల్వి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, తన కుటుంబాన్ని ప్రభుత్వం, అధికారులు, దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రమాదానికి గల పూర్తి వివరాలపై అధికారులు విచారణ చేపట్టారు.




