Pullampet: పుల్లంపేటలో ఘోర ప్రమాదం.. బస్సు-లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి!
Pullampet: తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Pullampet: పుల్లంపేటలో ఘోర ప్రమాదం.. బస్సు-లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి!
తిరుపతి జిల్లా: పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.కడప చెన్నై ప్రధాన రహదారి పై లారీ బస్సు ఢీ కొన్నాయి.ఈ ఘటనలో రాజంపేట కు చెందిన పునీత్ సాయి (9 నెలలు) అక్కడికక్కడే మృతి.
శ్రీకాళహస్తికి చెందిన యశ్విత (16) అనే బాలిక చికిత్స నిమిత్తం కడప తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది, 30 మందికి తీవ్ర గాయాల య్యాయి. ఇందులో పలువురికి కాళ్లు చేతులు తెగిపడ్డాయి.
తిరుపతి నుంచి కడప వెళ్తున్న నాన్ స్టాప్ బస్సు , కడప నుంచి తిరుపతి కి వెళ్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.క్షత గాత్రులను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి, చికిత్స అందించారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి,కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




