Chandragiri: చంద్రగిరి కోదండ రామస్వామి ఆలయంలో మహాలక్ష్మి దీప పూజ

Chandragiri: తిరుపతి జిల్లా చంద్రగిరి కోదండ రామస్వామి ఆలయంలో మహాలక్ష్మి దీప పూజకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 10 July 2026 8:56 AM IST
Chandragiri
X

Chandragiri: చంద్రగిరి కోదండ రామస్వామి ఆలయంలో మహాలక్ష్మి దీప పూజ

Chandragiri: తిరుపతి జిల్లా చంద్రగిరి లోని కోదండ రామస్వామి ఆలయం ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న మహాలక్ష్మి దీప పూజను వేగంగా నిర్వహించేందుకు టీటీడీ అని ఏర్పాట్లు చేసింది.

దీప పూజలో పాల్గొనే వేలాది మంది భక్తుల కోసం విశాలమైన షెడ్లు మ్యాట్లు దీపారాధన సామాగ్రి అన్న ప్రసాద పంపిణీ కేంద్రాలు నీటి సౌకర్యం ఎల్ఈడి స్కీమ్స్ తాత్కాలిక మరుగుదొడ్లు పారిశుద్ధ్య నిర్వహణకు అన్ని సౌకర్యాలు అధికారులు దగ్గరుండి సమకూరుస్తున్నారు.

అలాగే టిటిడి గార్డెన్ విభాగాలు ఆలయ ప్రాంగణ్యాన్ని విద్యుత్ దీపాలు సుందర పుష్పాలంకరణతో దివ్యంగా అలంకరించారు భక్తులతో ఆధ్యాత్మిక భావనను మరింత పెంపొందించేలా పవిత్రత వాతావరణాన్ని సృష్టించారు. ఈ మహోత్సవాన్ని భక్తులు తిలకించేందుకు వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా భక్తి ప్రసారం చేయనున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI

Next Story