Tirupati: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్
Tirupati: తుడాలో అవినీతి జరిగిందనేది అబద్ధం.. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మా కుటుంబంపై కక్షతోనే దుష్ప్రచారం చేయిస్తున్నారు.
Tirupati: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్
తిరుపతి: తుడాలో అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని నాపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. ఎసిబి విచారణ జరుగుతుంది కాబట్టి ఇన్ని రోజులు మేము మాట్లాడలేదు. 2018లో తుడా బడ్జెట్ 29కోట్లు 2024 సంవత్సరంలో 400కోట్ల బడ్జెట్ వచ్చే విధంగా కృషి చేశాం. తుడా ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. తుడాలో పనిచేసిన వారికి పెన్షన్లను ఇచ్చేందుకు కృషి చేశాం.
తుడా పార్కును 45కోట్లతో అభివృద్ధి చేశాం. బెంచీలలో ఎలాంటి అవినీతికి పాల్పడ లేదు. రాజమండ్రిలో చంద్రబాబు వేయించిన బెంచ్ ల విలువ 14వేలు, తుడా పరిధిలో వేయించిన బెంచ్ ల విలువ 9వేలు ఎంపిడిఓల ఖాతాల్లో తుడా నగదును బదిలీ చేసింది అభివృద్ధి కోసమే మా కుటుంబంపై దుష్ప్రచారం మానుకోండి. అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎసిబికి లేఖ రాయలేదు చంద్రగిరి ఎమ్మెల్యే మా కుటుంబంపై కక్షకట్టి దుష్ప్రచారం చేయిస్తున్నారు.




