Tirupati: సీఎం నారా చంద్రబాబు నాయుడుకు వీడ్కోలు పలికిన డాలర్స్ దివాకర్ రెడ్డి!
Tirupati: తిరుమల పర్యటన ముగించుకుని తిరుగుపయనమైన ఏపీ సీఎం చంద్రబాబుకు తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి గురువారం ఘనంగా వీడ్కోలు పలికారు.
Tirupati: సీఎం నారా చంద్రబాబు నాయుడుకు వీడ్కోలు పలికిన డాలర్స్ దివాకర్ రెడ్డి!
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమ పర్యటనను ముగించుకొని తిరుగుపయనమైన సందర్భంగా తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో తుడా ఛైర్మన్ డాక్టర్ దివాకర్ రెడ్డి కాసేపు ప్రత్యేకంగా సమావేశమై, తుడా పరిధిలో చేపడుతున్న పలు కీలక అభివృద్ధి పనులు మరియు భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. ముఖ్యంగా తిరుపతి నగర సుందరీకరణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం చేపట్టాల్సిన కొత్త రహదారుల నిర్మాణం, మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణ మరియు భక్తులకు, స్థానిక ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
తుడా ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, తిరుపతి నగరాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక మరియు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తుడా కీలక పాత్ర పోషించాలని సూచించారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు, తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ముఖ్యమంత్రి కి వీడ్కోలు పలికారు.




