Tirupati: చెర్లోపల్లిలో పోలింగ్ సరళిని పరిశీలించిన తుడా ఛైర్మన్!

Tirupati: తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పరిశీలించారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 5 Nov 2026 10:23 AM IST
Tirupati
X

Tirupati: చెర్లోపల్లిలో పోలింగ్ సరళిని పరిశీలించిన తుడా ఛైర్మన్!

Tirupati: తిరుపతి రూరల్ మండలం, చెర్లోపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఎంపీటీసీ,జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి పరిశీలించారు.

పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన, ఓటింగ్ జరుగుతున్న తీరును, ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును నిర్భయంగా, బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఎన్నికల నిబంధనలకు లోబడి,ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, పూర్తి పారదర్శకంగా, శాంతియుతంగా పోలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL