Railway Koduru: 3.5 కేజీల గంజాయి స్వాధీనం: ఇద్దరు అరెస్ట్!
Railway Koduru: తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం చెర్లోపల్లి క్రాస్ వద్ద 3.5 కేజీల గంజాయితో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Railway Koduru: 3.5 కేజీల గంజాయి స్వాధీనం: ఇద్దరు అరెస్ట్!
రైల్వే కోడూరు: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం చెర్లోపల్లి క్రాస్ రోడ్ వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరూ నిందితులు అరెస్ట్ చేసి వారి నుంచి 3.5 కేజీల గంజాయి రెండు సెల్ ఫోన్లు నగదును స్వాధీనం చేసుకున్నట్లు రేణిగుంట డిఎస్పి వై శ్రీనివాస్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో డి.ఎస్.పి ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా పై ప్రత్యేక నిఘా వ్యవస్థాపన చేస్తుందని తెలిపారు. గంజాయి పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి గంజాయి సేవించిన వారికి టెస్ట్ నిర్వహించి వారికి ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
తల్లిదండ్రులు పిల్లల విషయంలో నాకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు . గంజాయి కి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలిపినచో తెలిపిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామన్నారు.ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు రూరల్ సీఐ శ్రీనివాసులు చిట్వేల్ ఎస్సై వినోద్ రైల్వేకోడూరు ఎస్సై లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.




