Renigunta: రేణిగుంటలో అదృశ్యమైన ఇద్దరు బాలురు, గాలిస్తున్న పోలీసులు!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటలో ఇద్దరు బాలురు అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసి గాలిస్తున్న పోలీసులు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 3 Oct 2026 8:34 AM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో అదృశ్యమైన ఇద్దరు బాలురు, గాలిస్తున్న పోలీసులు!

Renigunta: రేణిగుంట పట్టణానికి చెందిన ఇద్దరు బాలురు అదృశ్యమైన ఘటనపై రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి, వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

బుగ్గ వీధికి చెందిన జి. నాగేంద్ర కుమారుడు జి. పాండురంగ (12), అతని స్నేహితుడు, బుగ్గ వీధికి చెందిన పి. గణేష్ రెడ్డి (15) ఇద్దరూ అక్టోబర్ 2న సాయంత్రం గుంటకట్ట సమీపంలోని గ్రౌండ్‌కు ఆడుకోవడానికి వెళ్లారు.

అనంతరం పాండురంగ సాయంత్రం సుమారు 6 గంటలకు ఇంటికి వచ్చి, గణేష్ రెడ్డికి చెందిన నోటుబుక్‌ను అతని ఇంటి వద్ద ఇచ్చి వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరూ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రేణిగుంట బస్టాండ్, రైల్వే స్టేషన్, పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు.

ప్రాథమిక సమాచారం ప్రకారం రాత్రి 8:45 గంటల సమయంలో ఇద్దరు బాలురు రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద కనిపించినట్లు పోలీసులకు సమాచారం అందింది.

జి. పాండురంగ (12) — ఎత్తు సుమారు 4 అడుగులు, చామనఛాయ. అదృశ్యమైన సమయంలో గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ ధరించి ఉన్నాడు.

పి. గణేష్ రెడ్డి (15) — ఎత్తు సుమారు 4.5 అడుగులు, చామనఛాయ. అదృశ్యమైన సమయంలో ఎరుపు రంగు టీ-షర్ట్ ధరించి ఉన్నాడు.

ఇద్దరు బాలుర ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా గుర్తించిన వారు వెంటనే రేణిగుంట పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

సమాచారం కోసం:

CI: 9491074540

SI: 9440796765

రేణిగుంట పోలీస్ స్టేషన్: 08772-289023

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA