Puttur: ఘోర విషాదం.. విద్యుత్ షాక్‌తో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు మృతి!
Puttur: బ్రహ్మోత్సవాల ఫ్లెక్సీలు కడుతూ 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Puttur: ఘోర విషాదం.. విద్యుత్ షాక్‌తో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు మృతి!
పుత్తూరు: తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.పట్టణంలోని కేఎన్ రోడ్డు,మౌనిక ఆప్టికల్స్ సమీపంలోని పూజా టెక్స్‌టైల్స్ వద్ద ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
పుత్తూరులో జరుగుతున్న ద్రౌపతమ్మ–ధర్మరాజుల వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సొంత ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బ్యానర్లు 11 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
మృతులను పుత్తూరు పట్టణానికి చెందిన విగ్నేష్ (19), గోకుల్ (18)గా గుర్తించారు. వీరిద్దరూ స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించే అవకాశం ఉంది.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం తెలియాల్సి ఉంది.




