రేణిగుంట పుట్టాలమ్మ గుడి వద్ద గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం!

రేణిగుంట పుట్టాలమ్మ గుడి వద్ద గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం!

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 7 July 2026 12:29 PM IST
రేణిగుంట పుట్టాలమ్మ గుడి వద్ద గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం!
X

రేణిగుంట పుట్టాలమ్మ గుడి వద్ద గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం!

తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలోని కట్ట పుట్టాలమ్మ గుడి సమీపంలో మంగళవారం ఉదయం గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రేణిగుంట పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిగా గుర్తించారు. ఆయన ఎరుపు-నలుపు రంగు చెక్స్ షర్ట్ ధరించి ఉన్నారు. సంఘటనా స్థలంలో సగం తాగిన మద్యం సీసా లభ్యమైన నేపథ్యంలో, రాత్రి సమయంలో మద్యం సేవించి డీహైడ్రేషన్ లేదా ఇతర సహజ కారణాల వల్ల మృతి చెంది ఉండవచ్చని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహంపై ఎలాంటి బాహ్య గాయాలు లేవని తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మృతుడి పేరు, చిరునామా లేదా కుటుంబ సభ్యుల వివరాలు తెలిసిన వారు వెంటనే రేణిగుంట పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story