Renigunta: రేణిగుంట హైవేపై ఘోర ప్రమాదం.. బైకర్ పరిస్థితి విషమం!

Renigunta: రేణిగుంట-కోడూరు రహదారి గొల్లపల్లి క్రాస్ వద్ద బైక్ ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 18 May 2026 10:36 AM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట హైవేపై ఘోర ప్రమాదం.. బైకర్ పరిస్థితి విషమం!

తిరుపతి జిల్లా: రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణిగుంట – కోడూరు ప్రధాన రహదారిలో ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 17,2026 సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో గొల్లపల్లి క్రాస్ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి AP 03 AW 2507 నంబర్ గల మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తూ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ ఘటనలో అతనికి తలకు తీవ్ర రక్త గాయాలు అయ్యాయి.స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని సమీపంలోని అమర హాస్పిటల్‌కు తరలించి చికిత్స కోసం చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

వైద్యుల ప్రాథమిక సమాచారం ప్రకారం, గాయపడిన వ్యక్తి మద్యం సేవించి ఉండవచ్చని, తనకు తానే వాహనం నుంచి పడిపోయి ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపారు.మోటార్ సైకిల్ వివరాల ఆధారంగా వాహన యజమానులను సంప్రదించగా, వారు ఆ వాహనాన్ని ఫైనాన్స్ ద్వారా ఇతరులకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ వాహనాన్ని ఎవరు వినియోగిస్తున్నారనే సమాచారం అందుబాటులో లేకపోవడంతో గాయపడిన వ్యక్తి పూర్తి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తి గురించి ఎవరైనా సమాచారం తెలిసిన వారు వెంటనే రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి సమాచారం అందించాలని సీఐ జయచంద్ర కోరారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story