Renigunta: ఘోరం రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని వ్యక్తి మృతి!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.
Renigunta: ఘోరం రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని వ్యక్తి మృతి!
రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరు గ్రామం సమీపంలోని రేణిగుంట–కోడూరు ప్రధాన రహదారిపై గురువారం గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి. అతడు మతిస్థిమితం లేని వ్యక్తి లేదా భిక్షాటన చేసేవాడిగా కనిపిస్తున్నట్లు తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని, అతని పై నుంచి వెళ్లిపోవడంతో ముఖం పూర్తిగా నుజ్జునుజ్జు కావడం వల్ల గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడింది. మృతుడి ఆచూకీ తెలిసిన వారు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వెంటనే రేణిగుంట పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Next Story




