Srikalahasti: శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్

Srikalahasti: కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సందర్శించి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 4 Oct 2026 7:43 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్

తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి భారత ప్రభుత్వ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్ నాథ్ ఠాకూర్ శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సందర్శించి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటేశులు , బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోళా ఆనంద్ , దేవస్థానం , మార్కెట్ యార్డ్ చైర్మన్ చెంచయ్య నాయుడు , బీజేపీ నాయకులు మరియు ఇతర ప్రముఖులు కేంద్ర మంత్రివర్యులకు స్వాగతం పలికారు.

దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి వేద పండితులచే వేద ఆశీర్వచనం నిర్వహించారు. దేవస్థానం తరఫున అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI