Venkatapuram: ఉంగరం గుర్తుకు ఓటేయండి.. పసల ముని యశస్వి విజ్ఞప్తి

Venkatapuram: వెంకటాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పసల ముని యశస్వి ఇంటింటి ప్రచారం; 3వ నంబర్ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 23 Nov 2026 5:10 PM IST
Venkatapuram
X

Venkatapuram: ఉంగరం గుర్తుకు ఓటేయండి.. పసల ముని యశస్వి విజ్ఞప్తి

వెంకటాపురం: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వెంకటాపురం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసల ముని యశస్వి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. తనకు కేటాయించిన 3వ నంబర్‌ ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.

గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచానని యశస్వి తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.

చదువుకున్న వారికి, యువతకు అవకాశం కల్పిస్తే గ్రామ అభివృద్ధికి కొత్త ఆలోచనలు, మరింత మెరుగైన సేవలు అందించగలమని ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. వెంకటాపురం గ్రామ పంచాయతీ అభివృద్ధికి తనకు ఒక్క అవకాశం కల్పించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సోము తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA