Tirupati: తుమ్మలగుంటలో 7 టన్నుల విభూదితో భారీ వినాయక ప్రతిమ!

Tirupati: తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో విభూదితో రూపొందించిన 11 అడుగుల వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. భక్తుల పెద్దఎత్తున దర్శనాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Sept 2026 12:27 PM IST
Tirupati
X

Tirupati: తుమ్మలగుంటలో 7 టన్నుల విభూదితో భారీ వినాయక ప్రతిమ!

Tirupati: తిరుపతిలో వినాయక చవితి వేడుకల్లో విభూది వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తుమ్మలగుంటలో బాల వినాయక కమిటీ అధ్యక్షుడు హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో విభూది వినాయకుడిని కొలువుదీర్చారు. శ్రీశైలం, మహానంది శైవ క్షేత్రాల నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన విభూదితో సినీ ఆర్ట్ డైరెక్టర్ రామస్వామి ఆధ్వర్యంలో విభూది వినాయకుడిని రూపొందించారు.

ఏడు టన్నుల విభూదిని వినియోగించి11 అడుగుల ఎత్తు, 7 అడుగుల వెడల్పుతో భారీ వినాయక ప్రతిమను తయారు చేశారు. విభూదితో రూపొందించిన వినాయకుడిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆధ్యాత్మికతకు కళాత్మకతను జోడించి రూపొందించిన ఈ విభూది వినాయకుడు తుమ్మలగుంటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్