Kaluru: కాలూరు గ్రామంలో వైభవంగా వినాయక చవితి వేడుకలు!
Kaluru: తిరుపతి రూరల్ కాలూరులో వైభవంగా వినాయక చవితి వేడుకలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టీడీపీ జిల్లా కార్యదర్శి మనోహర్ చౌదరి.
Kaluru: కాలూరు గ్రామంలో వైభవంగా వినాయక చవితి వేడుకలు!
Kaluru: తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం కాలూరు గ్రామంలో పీలేరు జాతీయ రహదరి ప్రక్కన వినాయక ప్రతిమను సోమవారం ఏర్పాటు చేశారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యల చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వినాయక విగ్రహానికి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి మనోహర్ చౌదరి తన అనుచరులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మనోహర్ చౌదరి ని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




