Srikalahasthi: శ్రీకాళహస్తిలో 'సేవా సంకల్ప్ బైక్ యాత్ర'కు ఘన స్వాగతం!

Srikalahasthi: తిరుపతి నుంచి వారణాసి వరకు సాగుతున్న సేవా సంకల్ప్ బైక్ యాత్రకు శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర దర్శనం.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 30 Sept 2026 1:19 PM IST
Srikalahasthi
X

Srikalahasthi: శ్రీకాళహస్తిలో 'సేవా సంకల్ప్ బైక్ యాత్ర'కు ఘన స్వాగతం!

Srikalahasthi: తిరుపతి నుంచి వారణాసి వరకు నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ బైక్ యాత్ర’ బుధవారం శ్రీకాళహస్తి చేరుకుంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికి, వారితో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.

అనంతరం యాత్రలో పాల్గొంటున్న రైడర్లు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి చేరుకుని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

నారా లోకేష్ ఆదేశాల మేరకు యువగళం, టీఎన్‌ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ సేవా సంకల్ప్ యాత్రను తిరుపతి నుంచి వారణాసి వరకు సుమారు 2,000 కిలోమీటర్ల మేర నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. యాత్రలో భాగంగా తొలిసారిగా శ్రీకాళహస్తికి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ యాత్రలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI