Renigunta: రేణిగుంట పాంచాలి నగర్‌లో వాటర్ లీకేజీ సమస్య: ప్రజల అవస్థలు!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట పాంచాలి నగర్‌లో తాగునీటి పైపులైన్ లీకేజీతో మట్టి, బురదమయంగా మారిన రోడ్లు. శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికుల విజ్ఞప్తి.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 3 Oct 2026 10:51 AM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట పాంచాలి నగర్‌లో వాటర్ లీకేజీ సమస్య: ప్రజల అవస్థలు!

Renigunta: రేణిగుంట గ్రామపంచాయతీ పరిధిలోని సచివాలయం-1 సమీపంలోని పాంచాలి నగర్ 11వ వీధిలో తాగునీటి పైపులైన్ లీకేజీ సమస్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. రెండు,మూడు వీధులకు తాగునీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైన్‌కు గతంలో లీకేజీ ఏర్పడటంతో పంచాయతీ సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.

అయితే మరమ్మతులు చేసిన తర్వాత కూడా తరచూ పైపులైన్ నుంచి నీరు లీకవుతూ రహదారిపైకి చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా తాగునీటిని సరఫరా చేసే చిన్న ఆటోలు సైతం ఈ మార్గంలో సులభంగా రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది.

లీకేజీ కారణంగా రహదారి మట్టి బురదగా మారడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. సమస్యను తాత్కాలికంగా మరమ్మతులు చేయడం కాకుండా, పైపులైన్ లీకేజీకి శాశ్వత పరిష్కారం చూపి రహదారిపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులను స్థానికులు కోరుతున్నారు.

ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఈ సమస్యపై పంచాయతీ అధికారులు మరోసారి దృష్టి సారించి శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA