Renigunta: పోలీసుల మెరుపు దాడి ఎన్‌ఫీల్డ్‌పై గంజాయి అమ్ముతూ దొరికిపోయాడు

Renigunta: పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇంద్రజిత్ రామ్ అనే వ్యక్తిని గాజులమండ్యం పోలీసులు అరెస్ట్ చేసి, 1.525 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 5 July 2026 9:33 PM IST
Renigunta
X

Renigunta: పోలీసుల మెరుపు దాడి ఎన్‌ఫీల్డ్‌పై గంజాయి అమ్ముతూ దొరికిపోయాడు

రేణిగుంట: తిరుపతి జిల్లాలో గంజాయి నిర్మూలనకు చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా గాజులమండ్యం పోలీసులు గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి,అతని వద్ద నుంచి 1.525 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

రేణిగుంట రూరల్ సీఐ ఎం. మంజునాథ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం,తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాలు, అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి పర్యవేక్షణలో,రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు సూచనల మేరకు ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు.

రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీ పరిధిలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్,వినాయక్ నగర్ క్రాస్ వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో రేణిగుంట రూరల్ సీఐ ఎం. మంజునాథ్ రెడ్డి, గాజులమండ్యం పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో వినాయకపురం–యర్రమరెడ్డిపాళెం డంపింగ్ యార్డు పరిసర ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా AP40 FK 6036 నంబర్ గల రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్–350 మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఓ వ్యక్తి పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.విచారణలో నిందితుడు ఇంద్రజిత్ రామ్ (42)**గా గుర్తించారు. ఇతడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నార్త్ 24 పరగణాస్ జిల్లా,ఇచ్చాపూర్‌కు చెందినవాడని, ప్రస్తుతం రేణిగుంట మండలం వినాయక్ నగర్‌లో నివాసం ఉంటూ గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.అతని వద్ద ఉన్న గ్రీన్ ప్లాస్టిక్ కవర్లను తనిఖీ చేయగా 1.525 కిలోల గంజాయి లభ్యమైంది.

గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

ఈ కేసును విజయవంతంగా ఛేదించిన గాజులమండ్యం పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story