Nagalapuram: ఉపాధి పనుల్లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన మహిళను కాటేసిన పాము!
Nagalapuram: తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో ఉపాధి హామీ పనుల వద్ద మహిళకు పాము కాటు.
Nagalapuram: ఉపాధి పనుల్లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన మహిళను కాటేసిన పాము!
నాగలాపురం: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం లో ఉపాధి హామీ పనుల్లో మహిళకు పాము కాటు, ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఓ మహిళను పాము కాటేసిన ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. నాగలాపురం నటరాజకుంటకు చెందిన ప్రేమ నాగలాపురం పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటుండగా అకస్మాత్తుగా ఓ పాము కాటేసింది. దీంతో సహచర కార్మికులు వెంటనే ఆమెను నాగలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు పరిస్థితిని గమనించి మెరుగైన చికిత్స కోసం నగరి ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అలాగే అమె రెండు రోజుల పాటు వైద్యల పరిరక్షణలో ఉండాలని డాక్టర్లు సూచించినట్లు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉంది.
Next Story




