Tirupati: జనావాసాల మధ్య వైన్ షాపును తెరవకుండా అడ్డుకున్న మహిళలు!
Tirupati: తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో జనావాసాల మధ్య కొనసాగుతున్న వైన్ షాపును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ దుకాణం ఎదుట బైఠాయించి ఆందోళన చేసిన మహిళలు.
Tirupati: జనావాసాల మధ్య వైన్ షాపును తెరవకుండా అడ్డుకున్న మహిళలు!
Tirupati: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కోడూరు ఎలైట్ వైన్ షాపు (53) జనావాసాల మధ్య కొనసాగుతుండటంపై స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. నివాస ప్రాంతంలో మద్యం దుకాణం ఉండటం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ షాపు ఎదుట బైఠాయించారు.మద్యం దుకాణం కారణంగా పరిసర ప్రాంతాల్లో అసౌకర్యకర పరిస్థితులు నెలకొంటున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
మద్యం సేవించిన కొందరు వ్యక్తులు ఇళ్ల వద్దకు వచ్చి అసభ్యకర పదజాలంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. దీంతో మహిళలు, చిన్నారులు ఇంటి నుంచి బయటకు రావాలన్నా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ఉదయం నుంచి రాత్రి వరకు ఇబ్బందులుమద్యం దుకాణం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుండటంతో రోజంతా తమకు ప్రశాంతత లేకుండా పోతోందని మహిళలు వాపోయారు. మద్యం సేవించేందుకు వచ్చే వారి కారణంగా రాకపోకలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటోందని పేర్కొన్నారు.
మహిళలు షాపు ముందు బైఠాయించారు. ఆందోళన నేపథ్యంలో షాపు తెరవకుండా అక్కడే కూర్చున్నారు. జనావాసాల మధ్య ఉన్న మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించి, తమకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని కోరారు.




