Naidupeta: భీమవరం, మేనకూరుల్లో బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై పాఠాలు!
Naidupeta: భీమవరం, మేనకూరు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Naidupeta: భీమవరం, మేనకూరుల్లో బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై పాఠాలు!
నాయుడుపేట: తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం భీమవరం మేనకూరు అంగన్వాడి కేంద్రాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారుల తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు మరియు అంగన్వాడి ఆయాలు, గర్భిణీలు, బాలింతలు, మరియు సామాన్య ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత శిశువు జన్మించిన మొదటి గంటలోపు తల్లిపాలు ప్రారంభించడం మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వడం ఆరు నెలల తర్వాత పౌష్టికాహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లి పాలు కొనసాగించడం వల్ల కలిగే ప్రయోజనాలు పై గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లల తల్లిలకు వివరించారు, తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాదని తల్లిపాలపై ఎటువంటి అపోహాలకు పోకుండా ఆరు నెలలపాటు కచ్చితంగా పిల్లలకు తల్లిపాలు అందించాలని వారు అన్నారు.




