Sullurupeta: ప్రతీ ఇంటికీ రూల్స్ మార్చిన అధికారులు.. ఏంటో తెలుసా?
Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా జరిగింది.
Sullurupeta: ప్రతీ ఇంటికీ రూల్స్ మార్చిన అధికారులు.. ఏంటో తెలుసా?
సూళ్ళూరుపేట: తిరుపతిజిల్లా సూళ్ళూరుపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థానిక అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూళ్ళూరుపేట మున్సిపల్ కమిషనర్ కె. చిన్నయ్య మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ..
ప్రకృతిని కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తును మనం కాపాడుకోవడమేనని, నేటి సమాజంలో పర్యావరణ కాలుష్యం ఒక పెద్ద సవాలుగా మారిందని, దీనిని అరికట్టడానికి మొక్కలు నాటడమే అత్యంత ప్రభావవంతమైన మార్గమని పేర్కొన్నారు. "ప్రతి మొక్క - భవిష్యత్తుకు భరోసా" అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు.
అలాగే "మొక్కలు నాటుదాం - పర్యావరణాన్ని కాపాడుదాం" అని ప్రజలకు దిశానిర్దేశం చేస్తూ, కేవలం మొక్కలు నాటడమే కాకుండా, వాటిని పెంచి పెద్ద చేయడంలో కూడా ప్రజల భాగస్వామ్యం అవసరమని, దీనివల్ల భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని వివరించారు.
సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డా. నెలవల విజయశ్రీ మరియు స్పెషల్ ఆఫీసర్ కె. దేవేంద్ర రెడ్డి పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కృషిని అభినందిస్తూ, సూళ్ళూరుపేటను పచ్చదనంతో కళకళలాడే 'పచ్చని సూళ్ళూరుపేట - స్వచ్ఛమైన సూళ్ళూరుపేట'గా తీర్చిదిద్దడమే మనందరి లక్ష్యం కావాలని, ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటడం ద్వారా పట్టణాన్ని హరితవనంగా మార్చవచ్చని చిన్నయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.
పర్యావరణాన్ని కాపాడుకోవడం అంటే ప్రకృతికి మనం ఇచ్చే కృతజ్ఞత అని, ఈ మహత్తర కార్యంలో మున్సిపల్ అధికారులు, మెప్మ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, సచివాలయ సిబ్బంది మరియు విద్యార్థులు సైనికుల్లా పనిచేయాలని, అప్పుడే మన పట్టణం ఆదర్శవంతంగా మారుతుందని తన ప్రసంగంలో స్పష్టం చేశారు.




