Renigunta: విమానాశ్రయంలో మాజీ మంత్రి యనమలకు ఘన స్వాగతం!
Renigunta: తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
Renigunta: విమానాశ్రయంలో మాజీ మంత్రి యనమలకు ఘన స్వాగతం!
రేణిగుంట: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు,మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తిరుపతి విమానాశ్రయానికి చేరుకోగా పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు,రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి. నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో నెల్లూరు డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి అన్నా అనిత, తిరుపతి పార్టీ క్లస్టర్ ఇన్‌చార్జిలు దంపూరు భాస్కర్ యాదవ్, కృష్ణ యాదవ్, మస్తాన్ యాదవ్, సూళ్లూరుపేట నాయకులు వెంకటేశ్ యాదవ్, రామారావుతో పాటు పలువురు టీడీపీ నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి ఆత్మీయంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story




