Srikalahasti: శ్రీకాళహస్తిలో ఘనంగా 'యోగాంధ్ర' కార్యక్రమం
Srikalahasti: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'యోగాంధ్ర' కార్యక్రమం శ్రీకాళహస్తి ఆలయ రాజగాలిగోపురం వద్ద ఘనంగా జరిగింది.
Srikalahasti: శ్రీకాళహస్తిలో ఘనంగా 'యోగాంధ్ర' కార్యక్రమం
శ్రీకాళహస్తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమం ఈరోజు ఉదయం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలోని రాజగాలిగోపురం వద్ద ఘనంగా నిర్వహించబడింది.
శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కొట్టేసాయి కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది దేవస్థానం సిబ్బంది, మున్సిపాలిటీ అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొని యోగా సాధనలు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యోగా మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం విశేష స్పందన పొందుతోందని తెలిపారు.
రాజగాలిగోపురం వద్ద జరిగిన సామూహిక యోగాభ్యాసం ఆకట్టుకోగా, కూటమి ప్రభుత్వం ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కట్టుబడి ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.




