Tirupati: రైల్వే కోడూరులో ఘోర ప్రమాదం.. నిద్రిస్తున్న యువకుడిపై లారీ ఎక్కి మృతి!

Tirupati: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మామిడికాయల యార్డ్‌లో విషాదం.

PRASAD, KODURU
Published on: 13 Jun 2026 1:32 PM IST
Tirupati
X

Tirupati: రైల్వే కోడూరులో ఘోర ప్రమాదం.. నిద్రిస్తున్న యువకుడిపై లారీ ఎక్కి మృతి!

Tirupati: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని మామిడికాయల యార్డ్‌లో నిద్రిస్తున్న యువకుడిపై గుర్తుతెలియని లారీ ఎక్కి వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది.

మామిడికాయల యార్డ్‌లోని లక్ష్మీనరసింహ మండి వద్ద నిద్రిస్తున్న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన రవీంద్ర (20)పై గుర్తుతెలియని లారీ ఎక్కి వెళ్లింది. ఈ ప్రమాదంలో రవీంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై లక్ష్మీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. లారీని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

PRASAD, KODURU

PRASAD, KODURU