Naidupeta: నాయుడుపేట ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

Naidupeta: నాయుడుపేటలో వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. అన్నదానం చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 8 July 2026 5:05 PM IST
Naidupeta
X

Naidupeta: నాయుడుపేట ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

నాయుడుపేట: దివంగత ముఖ్యమంత్రి, పేదల పెన్నిధి, రైతు బాంధవుడు డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు నాయుడుపేటలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి సూళ్ళూరుపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కేక్ కట్ చేసి, స్థానికులకు అన్నదానం చేశారు.

​ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, వైఎస్‌ఆర్ తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారని కొనియాడారు. రైతుల కోసం ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి చారిత్రాత్మక పథకాలతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేశారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలతో కోట్ల మంది పేద కుటుంబాలకు ఆయన భరోసా కల్పించారని, అందుకే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. మహానేత ఆశయాలకు అనుగుణంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనను అందించారని ఆయన గుర్తు చేశారు.

​ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తంబీరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, స్టేట్ జాయింట్ సెక్రటరీ పాలూరు దశరథ రామిరెడ్డి, జిల్లా కార్యదర్శులు మదలి సోమశేఖర్ రెడ్డి, కామిరెడ్డి రాజా రెడ్డి, నాయుడుపేట టౌన్ అధ్యక్షుడు కలికి మాధవ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ తంబీరెడ్డి జనార్దన్ రెడ్డి, ఎంపీపీ ధనమ్మ, మండల రైతు అధ్యక్షుడు కట్ట భవాని శంకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కటకం దీపిక, మహిళా రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యదర్శి కటకం జయరామయ్య, మండల వైస్ ప్రెసిడెంట్ బైనా మల్లికార్జున రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story