Railway Koduru: రైల్వే కోడూరులో వైఎస్సార్‌సీపీ ముమ్మర ప్రచారం

Railway Koduru: రైల్వే కోడూరు మండలంలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి అంబటి మురళి, ఎంపీటీసీ అభ్యర్థులు విస్తృత ఇంటింటి ప్రచారం నిర్వహించి విజయంపై ధీమా వ్యక్తం చేశారు.

PRASAD, KODURU
Published on: 3 Nov 2026 8:22 PM IST
Railway Koduru
X

Railway Koduru: రైల్వే కోడూరులో వైఎస్సార్‌సీపీ ముమ్మర ప్రచారం

రైల్వే కోడూరు: చివరి రోజు అయిన మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికల ప్రచారంలో గడపగడపకు విస్తృత ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్సిపి జడ్పిటిసి అభ్యర్థి అంబటి మురళి ఎంపీటీసీ సభ్యులు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు నాయకులు అభిమానులు.

రామన్న జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల సందర్భంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రైల్వే కోడూరు మండలంలో వైఎస్ఆర్సిపి జడ్పిటిసి అభ్యర్థి అంబటి మురళి ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేయు సభ్యులు మంగళవారం సాయంకాలం వరకు విస్తృత ప్రచారం. నిర్వహించారు జగనన్న ప్రవేశపెట్టిన పథకాలే తమ గెలుపుకు నాంది పలుకుతాయని ధీమా వ్యక్తం చేశారు.

ఈ ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సిపి రైల్వే కోడూరు జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేయుచున్న అంబటి మురళి మీడియాతో మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన పథకాలతో తమ వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు తను కూడా అత్యధిక మెజారిటీతో గెలుపొందేది ఖాయమని ధీమా వ్యక్తం చేయడమే గాక ప్రచారంలో ప్రజల యొక్క ఆదరణే తమ గెలుపుకు నాంది పలుకుతున్నాయని మన మీడియాకు వ్యక్తిగతంగా తెలపడం జరిగింది.

అంతేకాక రైల్వే కోడూరు కూటమి పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే వైఎస్ఆర్సిపి జడ్పిటిసి అభ్యర్థి అయిన అంబటి మురళి గెలుపుకు మొగ్గు చూపుతున్నట్లు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎటువంటి అంతర్గత విభేదాలకు తావు లేకుండా సామరస్యంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటుంది మన మీడియా బృందం ఎన్నికల అనంతరం ప్రచారమయ్యే వార్తలు ద్వారా వివిధ పార్టీల అభ్యర్థుల యొక్క గెలుపు ఓటముల విశేషాలను వీక్షించి తెలుసుకుందాం నమస్కారం.

PRASAD, KODURU

PRASAD, KODURU