Naidupeta: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి మాజీ ఎమ్మెల్యే డిమాండ్
Naidupeta: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ నాయుడుపేటలో ఆగస్టు 6 నుండి రిలే దీక్షలు, మహా ర్యాలీకి అనుమతి ఇవ్వాలని డీఎస్పీకి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వినతిపత్రం ఇచ్చారు.
Naidupeta: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి మాజీ ఎమ్మెల్యే డిమాండ్
నాయుడుపేట: తిరుపతి జిల్లా నాయుడుపేట లో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు, ఆగస్టు 10న మహా ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో వాటికి అనుమతి మంజూరు చేయాలని కోరుతూ సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నాయుడుపేట డీఎస్పీకి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాయుడుపేట టౌన్ అధ్యక్షుడు కలికి మాధవ్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి, రూరల్ అధ్యక్షుడు ఒట్టూరు కిషోర్ యాదవ్, లీగల్ సెల్ అధ్యక్షుడు చదలవాడ కుమార్, వైస్ చైర్మన్ జలదింకి వెంకటకృష్ణారెడ్డి, పెర్నాటి రాహుల్, భవన్, బంగారుబాబుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




