Tirupati: రేణిగుంట విమానాశ్రయంలో మాజీ మంత్రి బొత్సకు ఘన స్వాగతం!
Tirupati: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు రేణిగుంట విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
Tirupati: రేణిగుంట విమానాశ్రయంలో మాజీ మంత్రి బొత్సకు ఘన స్వాగతం!
తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయం వెలుపల బొత్స సత్యనారాయణకు పూలబొకేలు అందించి పార్టీ శ్రేణులు ఆత్మీయంగా సత్కరించారు. అనంతరం ఆయన విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story




