Jordar News: మానవత్వం ఏమైంది? ప్రమాదం జరిగిన లారీ నుంచి మేకలను ఎత్తుకెళ్లిన జనం!

Jordar News: ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో లారీ ప్రమాదం జరిగితే, బాధితులకు సహాయం చేయాల్సింది పోయి మేకలను ఎత్తుకెళ్లిన స్థానికులు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 May 2026 7:09 AM IST
Jordar News
X

Jordar News: మానవత్వం ఏమైంది? ప్రమాదం జరిగిన లారీ నుంచి మేకలను ఎత్తుకెళ్లిన జనం!

Jordar News: ఏహే.. ఎవ్వలు గింత గుడ తగ్గుతలేరు గదా. శిన్నాపెద్దా.. అనే తేడాలేం సూపెడ్తలేరు. గట్టిగట్టిగున్న పొట్టేళ్లను లావట్టనీకి ఒగలికొగలు సాయమైతున్నరు. వీటి ఓనర్లు మంచిగుండి, వాటికి తొవ్వల దెబ్బలు తాకుతెనన్న సాయం జెయ్యరు కావచ్చు కని, ఓనర్లు బేజారయ్యెటాలకు సమరోత్సాహంతోని సాయమైతున్నరు. ఫ్రీగచ్చిన వాటి కోసం ఎంత రిస్కుకైనా తగ్గేదేలేదంటున్రు. ఉత్తర్ ప్రదేశ్ దిక్కు కౌశాంభి అనే ఊర్ల మేకల లోడుతోని పోతున్న లారీకి టక్కరైతే ఈ తీర్ల తిప్పలు వడ్డరు అక్కడి జనాలు. అండ్లున్నోల్లు టక్కరై గోసపడ్తె.. అయ్యో పాపమని సుతం అనకుంట, మేకల మీద ఎక్కడలేని ప్రేమసూపెట్టిర్రు.

ఈ లారీల.. దగ్గర్దగ్గర 2 వందల మేకలుంటె, 20 మేకల దాంక జీవిడ్శినయట. కొన్ని మేకలకు కాళ్లిరిగినయట. దెబ్బలు తాకినయట. నలుగురు మన్షులకు దెబ్బలు తాకినయట. ఇగ అక్కడోల్లు వీడియో తీశి ఇంటర్నెట్ల ఇడుస్తె.. మన్షులకంటె మేకలే ఎక్వైనయని దుమ్మెత్తిపోత్తున్నరు ఈ మేకల ఓనర్లు. ఈ బుడ్డవీడియోలను ఇంటర్నెట్ల తిప్పుకుంట.. కరువుకు కేరాఫ్ ఉన్నరు కౌశాంభి జనాలనుకుంట తిట్టిన తిట్టు తిట్టకుంట తిడ్తున్నరు నెటిజన్లు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story