News Analysis: 22ఏ శాపం బీఆర్ఎస్ చేసిన పాపమే, ప్రజల సమస్యలపై చర్చ జరగకుండా డ్రామాలు ఆడుతున్నారు: బీజేపీ నేత

News Analysis: 22ఏ శాపం బీఆర్ఎస్ చేసిన పాపమేనని హెచ్‌ఎమ్‌టీవీ డిబేట్‌లో బీజేపీ నేత శంకరబోయిన రవి మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 15 Sept 2026 12:03 PM IST
News Analysis
X

News Analysis: 22ఏ శాపం బీఆర్ఎస్ చేసిన పాపమే, ప్రజల సమస్యలపై చర్చ జరగకుండా డ్రామాలు ఆడుతున్నారు: బీజేపీ నేత 

News Analysis: తెలంగాణ అసెంబ్లీలో 22ఏ నిషేధిత భూముల అంశం, ప్రజా సమస్యలపై హెచ్‌ఎమ్‌టీవీ నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శంకరబోయిన రవికుమార్ తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు.

రాష్ట్రంలో వేలాది ఎకరాలు 22ఏ జాబితాలో చేరడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రధాన కారణమని, ఆనాటి తప్పుల వల్లే నేడు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రవికుమార్ మండిపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని కొనసాగిస్తోందని విమర్శించారు.

అసెంబ్లీలో నిజమైన ప్రజా సమస్యలపై చర్చ జరగకూడదనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ అయ్యేలా ప్రవర్తించారని, అధికార, ప్రతిపక్షాల తీరు ప్రజలను మోసం చేసేలా ఉందని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.