Big Debate: పిల్లల్ని చదివిస్తున్నామా? చంపేస్తున్నామా? సడన్ కార్డియాక్ అరెస్ట్‌పై డాక్టర్ ప్రమోద్ విశ్లేషణ

Big Debate: బడిలో టీచర్ చెంపదెబ్బ కొట్టడంతో ఆరేళ్ల బాలుడు హఠాన్మరణం చెందిన ఘటనపై ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ అందించిన పూర్తి వైద్య విశ్లేషణ.

Arun Chilukuri
Published on: 22 Aug 2026 12:02 PM IST
Big Debate
X

Big Debate: పిల్లల్ని చదివిస్తున్నామా? చంపేస్తున్నామా? సడన్ కార్డియాక్ అరెస్ట్‌పై డాక్టర్ ప్రమోద్ విశ్లేషణ

Big Debate: పాఠశాలల్లో పిల్లలపై పెరుగుతున్న ఒత్తిడి, ఉపాధ్యాయుల కఠిన ప్రవర్తన మరో పసిప్రాణాన్ని బలిగొంది. తరగతి గదిలో టీచర్ తీవ్రంగా భయపెట్టి చెంపదెబ్బ కొట్టడంతో ఆరేళ్ల బాలుడు క్షణాల్లో కుప్పకూలి మృతి చెందిన దిగ్భ్రాంతికర సంఘటనపై ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ వైద్య పరమైన విశ్లేషణ అందించారు.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ చిన్నారి ఇప్పటికే తీవ్ర భయాందోళనతో వణుకుతూ, ఏడుస్తున్నట్లు కనిపించాడు. ఆ సమయంలో టీచర్ బాలుడి చొక్కా పట్టుకుని లాగి, చెంపదెబ్బ కొట్టగానే ఆ చిన్నారి కేవలం ఆరు సెకన్లలోనే నేలపై కుప్పకూలిపోయాడు.

ఈ ఘటనపై సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ మాట్లాడుతూ.. ఆ బాలుడు "సడన్ కార్డియాక్ అరెస్ట్" కారణంగానే ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. బాలుడు అంతకుముందే తీవ్రమైన ఆందోళన, ఒత్తిడికి గురికావడం వల్ల గుండె రిథమ్ మారిపోయి, గుండె ఆగిపోయి ఉంటుందని స్పష్టం చేశారు. టీచర్ తీవ్రంగా బెదిరించే రీతిలో ప్రవర్తించడమే ఈ మరణానికి ప్రధాన 'ట్రిగ్గర్'గా మారిందని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story